హైదరాబాద్ – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికొద్దిసేపట్లోే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు. . నేటి ఉదయం 10:30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి తన మంత్రివర్గ సహచరుడు శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతి కుమారి, ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) కార్యదర్శి శేషాద్రి, రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) జితేందర్‌తో కలిసి ప్రధానిని కలవనున్నారు. పెండింగ్ లో ఉన్న పలు అంశాలపై ప్రదానితో ఈ భేటీలో చర్చించనున్నారు.
Delhi | మరికొద్దిసేపట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో రేవంత్ రెడ్డి భేటీ
