- ఢిల్లీ బ్లాస్ట్ బాధితులను పరామర్శించిన ప్రధాని మోదీ…
ఆంధ్రప్రభ : రెండు రోజుల భూటాన్ పర్యటన ముగించుకుని ప్రధాని నరేంద్ర మోదీ భారతదేశానికి తిరిగి వచ్చారు. వచ్చిన వెంటనే ఢిల్లీ (Delhi) విమానాశ్రయం నుంచి నేరుగా ఎల్‌ఎన్‌జేపీ ఆసుపత్రికి చేరుకున్నారు. ఎర్రకోట సమీపంలో జరిగిన కార్ బ్లాస్ట్‌లో గాయపడిన వారిని ప్రధాని స్వయంగా పరామర్శించారు.
ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 12 మంది మృతి చెందగా, సుమారు 100 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గాయపడిన వారికి అందిస్తున్న చికిత్సపై వైద్యులను మోదీ వివరంగా అడిగి తెలుసుకున్నారు. బాధితులను పరామర్శిస్తూ ధైర్యం చెప్పి, వారికి అవసరమైన సహాయం అందించేందుకు అధికారులను ఆదేశించారు.
Delhi | అత్యవసర సమావేశం
ఈ ఘటనపై దర్యాప్తు పురోగతిని సమీక్షించేందుకు ప్రధాని ఈరోజు సాయంత్రం క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. తరువాత క్యాబినెట్ సమావేశంలో కూడా ఢిల్లీ బ్లాస్ట్ తాజా పరిణామాలపై సమీక్ష జరపనున్నారు.




