న్యూఢిల్లీ – గుంటూరులో చిల్లీ బోర్డ్ (chilli board ) , శ్రీకాకుళంలో జీడిపప్పు బోర్డ్ (kaju board ) , చిత్తూరులో మామిడి బోర్డ్ (mango board ) ని ఏర్పాటు చేయాలని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivraj Singh Chouhan) ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు (Minister Atchannaidu) కోరారు. విభజన చట్టం ప్రకారం శ్రీకాకుళం జిల్లాలో కేంద్ర అగ్రికల్చర్ విశ్వవిద్యాలయం (agriculture university ) ఏర్పాటు చేయాలని విన్నవించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న అచ్చెన్నాయుడు నేడు మంత్రి చాంబర్ లో కలిశారు. ఈ సందర్భంగా ఎపిలోని రైతుల సమస్యలపై(farmers issues ) ఆయనకు వివరించారు.
రాష్ట్రంలో వ్యవసాయరంగా సమగ్రా అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందించాలని కేంద్రమంత్రిని కోరారు. మామిడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అచ్చెన్నాయుడు ప్రత్యేకంగా ప్రస్తావించారు. తొతాపురి మామిడి ధర తగ్గడంతో రైతులకు నష్టం వాటిల్లుతోందని చెప్పారు. ధర రూ.8కి పడిపోవడంతో ఏపీ ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ధరల లోటు చెల్లింపు పథకం కింద మద్దతు ధరగా ఏపీ ప్రభుత్వం రూ.12 ధర నిర్ణయించినట్లు వివరించారు మంత్రి అచ్చెన్నాయుడు.
6.5 లక్షల మెట్రిక్ టన్నుల తొతాపురి కొనుగోలు చేయాల్సి ఉందని అచ్చెన్నాయుడు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.260 కోట్లు ఖర్చు చేస్తోందని.. కేంద్ర భాగస్వామ్యం కావాలని కోరారు. మామిడి ధర రూ.8లకి పడిపోవడంతో రైతులకి వచ్చిన నష్టనివారణకు మద్దతు ధర అనివార్యమైందని చెప్పారు. వెనుకబడిన జిల్లాల కోసం మైక్రో ఇరిగేషన్ పథకానికి రాయితీ పెంపుపై విజ్ఞప్తి చేశారు. బుందేల్‍ఖండ్ తరహాలో ఏపీకి కేంద్రప్రభుత్వం అదనపు సాయం చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు కోరారు.
మంత్రి అచ్చెన్నాయుడు వినతులపై సానుకూలంగా కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు. త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కాగా, అచ్చెన్న వెంట పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఉన్నారు.