ధాన్యం దళారుల పాలు..

ధాన్యం దళారుల పాలు..
- కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం
- దళారులకు ధాన్యం విక్రయించి మోసపోతున్న రైతులు
మహబూబాబాద్ జిల్లా, తొర్రూరు, (ఆంధ్రప్రభ) : మొంథా తుఫాన్ ప్రభావంతో మండలంలో వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. పంటలు నీట మునిగి రైతులు కన్నీరు మున్నీరయ్యారు. అయినప్పటికీ రైతులు కన్నీరు దిగమింగుకొని కోతకు వచ్చిన వరి పంటను మిషన్లతో కోసి కుప్పగా పోసి విక్రయించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో దాన్యం దళారులకు అమ్మాల్సిన పరిస్థితి నెలకొంది.
రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యం దళారుల పాలవుతోంది. రైతులకు ధర తక్కువ చెల్లించి కొంత మంది వ్యాపారులు నిలువునా దోచుకుంటున్నారు. పచ్చివడ్ల పేరుతో తక్కువ ధర చెల్లించి రైతులను మోసం చేస్తున్నారు. మండలంలో దళారులు యదేచ్ఛగా ధాన్యం కొనుగోలు చేస్తున్నా…. పిఎసిఎస్, ఐకెపి, మార్కెట్ కమిటీ, రెవిన్యూ అధికారులు పట్టించు కోవడం లేదు.
మడిపల్లి గ్రామంలో ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రం మినహా అధికారులు ఇప్పటి వరకు మరే గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించలేదు. దీంతో పంట చేతికి వచ్చినా…. ధాన్యం నిల్య చేయలేక, దళారులకు అమ్ముకుంటున్నారు రైతులు. ఇదే క్రమంలో తక్కువ ధర చెల్లించి వ్యాపారులు కూడా రైతులను మోసం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ దృష్టి సారించి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయించాలని రైతులు కోరుతున్నారు.
మండలంలో ఇదీ పరిస్థితి…
మండలంలో ఈ ఏడాది సుమారు 17 వేల ఎకరాల్లో రైతులు పంటలను సాగు చేశారు. నేటి వరకు చాలా ప్రాంతాల్లో పంట చేతికి వచ్చింది. కొంత మంది రైతులు పంటను కోసి ఆరబెడుతుండగా, చాలా మంది రైతులు కోత మిషిన్ లతో పంటను దక్కించుకుంటున్నారు.
ఇదే అదునుగా భావించిన దళారులు పంట చేల వద్దకు వెళ్ళి పచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. రైతులకు తక్కువ ధరను చెల్లిస్తున్నారు. ఇక ధాన్యం కొనుగోలు కేంద్రాలు లేక పోవడంతో చేసేది ఏమీ లేక రైతులు ధళారులకు అమ్ముకుంటున్నారు.
ఇదే మని రైతులను అడగ్గా ఇప్పటికే తెగుల్ళు, దోమ పోటు కారణంగా పంటలను కోల్పోయామని, పైన మబ్బులు పట్టి ఉన్నాయని చేసేది ఏమీలేక అమ్ముకుంటున్నామని రైతులధాన్యం కొనుగోలు కేద్రాలు నడిచేవి. రైతులు పండించిన ధాన్యాన్ని అక్కడ అమ్ముకుని సొమ్ము చేసుకునేవారు. ప్రభుత్వం అందించే మద్దతు ధరను పొందువారు.కానీ నవంబర్ నె ల ముగుస్తున్నా అధికారికంగా ప్రభుత్వ కేంద్రాలు ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు.
మొదలైన వ్యాపారుల దోపిడీ..
మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు లేక పోవడంతో ధళారులు దోపిడీ జోరుగా సాగుతోంది. ప్రతీ వ్యాపారీ రైతుల పంట పొలాల వద్దకు వెళ్ళి తక్కువ ధరకు ధాన్యం కొంటున్నారు.కొంత మంది వ్యాపారులు ఒక అడుగు ముందకు వేసి ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేం ద్రాలు ఇప్పుడే ప్రారంభం కావని తప్పుడు మాటలు చెప్పుతున్నారు.
వారి అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని వడ్లు దండుకు పోతున్నారు. అనంతరం ఎక్కవ ధరకు అమ్ముకుంటున్నారు.ఇలా మండలంలో సుమారు 20 నుండి 25 మందికి పైగా దళారులు వ్యాపారాన్ని సాగిస్తున్నారు.మం డలంలో ధాన్యం దళారుల పాలవుతున్నా మార్కెట్ క మిటీ, రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోకపోవడం విశేషం.
అన్నదాతల అవస్థలు…
రాష్ట్ర ప్రభుత్వం ఏ గ్రేడ్ ధాన్యం క్వింటాకు రూ.2389, సాధారణ రకం రూ.2369 ప్రభుత్వం మద్దతు ధర నిర్ణయించింది. ఓ వైపు వరి కోతలు ఊపందుకొని ధాన్యం వెల్లువలా వస్తోంది. అయినా కొనుగోలు కేంద్రాలను ఎప్పుడు ప్రారంభిస్తారో స్పష్టత లేదు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
పండించిన పంటను దళారులకు అమ్ముకోలేక, గిట్టుబాటు ధర రాక అవస్థలు ప డుతున్నారు. కొనుగోలు కేంద్రం లేకపోవడంతో వ్యాపారులు తమ దందాను ప్రారంభించారని రైతులు ఆవే దన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.
