భూసమస్యపై తీవ్ర మనస్తాపం..

తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో వ్యక్తి ఆత్మహత్య
కోయిలకొండ, ఆంధ్రప్రభ : భూ సమస్య పరిష్కారం కాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి తహసీల్దార్ కార్యాలయ ఆవరణలోనే చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన కోయిలకొండ మండలంలో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.

మండలంలోని పారుపల్లి గ్రామానికి చెందిన లవప్ప (53), తహసీల్దార్ కార్యాలయ ఆవరణలోని చెట్టుకు ఉరేసుకుని మృతి చెందాడు. భూ సమస్యకు సంబంధించి తీవ్ర మనస్తాపానికి గురైన తన తండ్రి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని మృతుడి కుమారుడు కురుమూర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై నాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.