మృతుల కుటుంబాలను పరామర్శించిన పాపన్న

రేగొండలో బాధిత కుటుంబాలకు పరామర్శ

రేగొండ, ఆంధ్రప్రభ : జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రేపాక, ఆర్జీ తండా గ్రామాలకు చెందిన యర్రం అనసూయ, బొల్ల సారమ్మ ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందారు. వారి కుటుంబ సభ్యులను బీజేపీ మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వెన్నంపల్లి పాపన్న బుధవారం పరామర్శించారు. మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపి మనోధైర్యం కల్పించారు.

ఆయన వెంట బీజేపీ మండల అధ్యక్షుడు బండి శ్రీనివాస్‌, ఆర్జీ తండా గ్రామ ఉపసర్పంచ్‌ గుగులోతు మోహన్‌, బూత్‌ అధ్యక్షులు పెండల సంపత్‌, పగడాల మనోహర్‌, బాలు తదితరులు పాల్గొన్నారు.