Death of rams | జీఐసీ కాలనీలో చిరుత దాడి

Death of rams | జీఐసీ కాలనీలో చిరుత దాడి

  • మూడు పొట్టేళ్ల మృతి
  • రైతుకు రూ.1.20 లక్షల నష్టం
  • పరిసర ప్రాంతాల్లో భయాందోళన

Death of rams | పెనుకొండ రూరల్, ఆంధ్రప్రభ : పెనుకొండ పట్టణ పరిధిలోని జీఐసీ కాలనీలో చిరుత సంచారం(Leopard roaming) కలకలం రేపింది. శనివారం తెల్లవారు జామున సుమారు 3 గంటల సమయంలో చిరుత అకస్మాత్తుగా దాడిచేసి రైతుకు చెందిన మూడు పొట్టేళ్లను పొట్టన పెట్టుకుంది. ఈ ఘటనలో రైతు వెంకటేశ్‌కు సుమారు రూ.1 లక్ష 20 వేల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు(Officers) అంచనా వేశారు.

సమాచారం అందుకున్న వెంటనే వెటర్నరీ డాక్టర్ జాహ్నవి, డిప్యూటీ రేంజర్ చాంప్లా నాయక్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రాహుల్ ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతి చెందిన పొట్టేళ్లను పరిశీలించి పంచనామా(Panchnama) నిర్వహించారు. చిరుత దాడి ఆనవాళ్లు స్పష్టంగా ఉన్నాయని అటవీశాఖ అధికారులు తెలిపారు.

Death of rams

ఈ సందర్భంగా అటవీశాఖ అధికారులు(Forest officials) రైతు వెంకటేశ్‌కు ప్రభుత్వం తరఫున నిబంధనల ప్రకారం పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. చిరుతను పట్టుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. చిరుత సంచారం నేపథ్యంలో జీఐసీ కాలనీతో పాటు పరిసర ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనకు(To panic) గురవుతున్నారు. రాత్రి వేళల్లో బయట తిరగవద్దని, పశువులను సురక్షితంగా ఉంచుకోవాలని అటవీశాఖ అధికారులు ప్రజలకు సూచించారు. చిరుత కదలికలపై నిఘా పెంచామని, అవసరమైతే బోన్లు ఏర్పాటు చేస్తామని వారు తెలిపారు.

ఈ ఘటనను తెలుసుకున్న టీడీపీ నాయకులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతి చెందిన పొట్టేళ్లను పరిశీలించారు. రైతుకు తక్షణమే(Instantly to the farmer) పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని వారు అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు శ్రీరాములు, బాబుల్ రెడ్డి త్రివేంద్ర, బండా నూర్, షౌకత్, షమూన్, శివా నాయక్, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply