వ్యక్తి వ్యక్తి మృతి
పాలకుర్తి, ఆంధ్రప్రభ : పాలకుర్తి మండలం బసంత్ నగర్ రాజీవ్ రహదారి (కన్నాల రైల్వే లైన్) సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి ఈ రోజు రాత్రి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హుస్నాబాద్ కు చెందిన శ్రీధర్(35) ద్విచక్రవాహనంపై పెద్దపల్లి వైపు వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది.
వాహనం శ్రీధర్ తలపై నుంచి వెళ్లినట్లు కనిపిస్తోంది. బసంత్ నగర్ ఎస్ఐ నూతి శ్రీధర్ ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

