Death anniversary | ఘనంగా గాంధీ వర్థంతి

Death anniversary | గణపురం, ఆంధ్రప్రభ : మహాత్మా గాంధీ వర్ధంతిని ఈ రోజు మండలంలోని చెల్పూర్లో ఉప సర్పంచ్ పోనగంటి మలహాల్ రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బస్టాండ్లోనీ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గాంధీజీ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు రూపిరెడ్డి, సులోచన రాజిరెడ్డి, అంజద్ పాషా, మాజీ సర్పంచ్ కొత్త పద్మ వెంకన్న, మాజీ ఎంపీటీసీ బైరగోని సరిత తిరుపతి గౌడ్, నాయకులు అయితు రమేష్, అడ్డురి శ్రీధర్ రావు, వేముల వంశీ, కారోబార్ పొన్నం రఘు తదితరులు పాల్గొన్నారు.
