గుండెపోటుతో సర్మిడి దేవురావు మృతి

గుండెపోటుతో సర్మిడి దేవురావు మృతి
జైనూర్,ఆంధ్రప్రభః కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జై నూర్ మండలంలోని మార్లవాయి రాయి సెంటర్ సర్మిడి జుగునక దేవురావు(55)కు గుండెపోటు రావడంతో ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో చికిత్సలు పొందుతూ గురువారం మధ్యాహ్నం మృతి చెందినట్లు ఆయన బంధువులు తెలిపారు. గత మూడు రోజుల క్రితం అనారోగ్యాన్ని గురికాగా రిమ్స్ ఆస్పత్రిలో చికిత్సలు చేసి పరీక్షలు చేయగా గుండెపోటు లక్షణాలు ఉన్నాయని వైద్య అధికారులు తెలిపినట్లు వారు పేర్కొన్నారు. చికిత్సలు పొందుతూ మృతి చెందడంతో మార్లవాయి గ్రామంలో విషాదఛాయలు అమ్ముకున్నాయి.
దేవు రావుఆదివాసి సమాజంలో రాయిసెంటర్ సార్మేడిగా అనేక ఏళ్లుగా పనిచేశారు. ఆదివాసి న్యాయ వ్యవస్థలో ఉంటూ,అనేక సామాజిక కార్యక్రమాలను ఆయన ముందుండి చేశారు. ఆయన మరణం ఆదివాసి జాతికి తీరాని లోటు ఏర్పడింది. ఈ విషయం తెలియగానే జైలు మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిమేత విశ్వనాత్ రావు, మార్లవాయి సర్పంచ్ కనక ప్రతిభ వెంకటేశ్వరరావు, జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ కనక యాధవరావు, జైనూర్ సర్పంచ్ కోడప ప్రకాష్,మాజీ సర్పంచ్ మడవి భీంరావు, మెస్రం నాగోరావు, మాజీ ఏంపిటిసి కుమ్రం భగవంతరావు నాయకులు రిమ్స్ ఆస్పత్రికి వెళ్లి దేవురావు మృతదేహాన్ని చూసి కలత చెందారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపి మనోధైర్యం కల్పించారు.
