Dead | మూడేళ్ల బాలుడు మృతి

Dead | వెబ్‌డెస్క్, ఆంధ్ర‌ప్ర‌భ : మేడ్చల్ జిల్లా కూకట్‌పల్లి పరిధిలో హైదర్ ‌నగర్‌లో విషాదం ఘ‌ట‌న చోటుచేసుకుంది. స్విమ్మింగ్ ఫూల్‌లో పడి మూడేళ్ల బాలుడు మృతి చెందారు. హైదర్‌నగర్‌లోని గేటెడ్ కమ్యూనిటీలో ఈ రోజు మధ్యాహ్నం బాలుడు అర్జున్ మృతి చెందిన‌ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు వెంట‌నే ఘటనా స్థలానికి చేరుకుని బాలుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమెదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బాలుడి మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.

Leave a Reply