Dead | కోకిలాంబ ఇకలేరు
- సిద్ధార్థ మెడికల్ కాలేజీకి
- పార్థీవ దేహం అప్పగింత
Dead | ఘంటసాల, ఆంధ్రప్రభ : ప్రముఖ సంఘ సేవకురాలు, ఆధ్యాత్మిక ప్రముఖురాలు గుత్తికొండ కోకిలాంబ (75) మృతి చెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యానికి గురై ఇంటికే పరిమితమైన ఆమె శనివారం మధ్యాహ్నం తుదిశ్వాస విచిడినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ప్రముఖ దివంగత వైద్యులు, సం ఘ సేవకులు గుత్తికొండ గోపాలరావు ఘంటసాల పరిసర గ్రామాల్లో పలు సామాజిక సేవా కార్యక్రమాలు అందించి పలువురి మన్ననలు పొందారు. గోపాలరావు 2004వ సంవత్సరంలో మృతి చెందిన అనంతరం ఆయన అందించిన పలు సేవలను కోకిలాంబ కొనసాగించారు.
వీరిరువురి పిల్లలకు లేరు. అన్ని వర్గాల్లోని పేదలకు తమవంతు సహయ సహాయసకారాలు అందిస్తూ అందరికీ అమ్మగా కోకిలాంబ పేరు తెచ్చుకున్నారు. రెడ్ క్రాస్ మండల కార్యదర్శిగా, వైజ్ మెన్ క్లబ్ డైరెక్టర్ గా పలు సేవా కార్యక్రమాలు అందించారు. అంతేకాకుండా హిందూ ధర్మపరిరక్షణ కోసం అహర్నిశలు శ్రమించారు. కోకిలాంబ మృతి సమాచారంతో ఘంటసాల మండలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు ప్రముఖులు ఆమె పార్ధివదేహాన్ని సం దిర్శంచి పూలమాల వేసి నివాళులర్పించారు.

Dead | సిద్ధార్థ మెడికల్ కాలేజీకి పార్థీవ దేహం అప్పగింత
కోకిలాంబ పార్థివదేహాన్ని ఆమె కోరిక మేరకు చిన అవుటపల్లిలో ఉన్న పిన్నమనేని సిద్దార్థ మెడికల్ కళాశాలకు ఆమె పార్థివదేహాన్ని అప్పగిస్తున్నట్లు మేనల్లుడు మేకా రవీంద్ర బాబు, కనగాల ఉదయ్ భాస్కర్ లు తెలిపారు. శనివారం సాయంత్రం మెడికల్ కళాశాలకు చెందిన బృందం చినకళ్లేపల్లి విచ్చేయగా, వారికి కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్తుల సపమక్షంలో పార్థిపదేహాన్ని అప్పగించారు. కోరిలాంబ తల్లి మేకా రత్నమాంబ పార్థివదేహాన్ని కూడా మెడికల్ కళాశాలకు గతంలో కోకిలాంబ అప్పగించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుత్తికొండ రాము, రిటైర్డ్ ఈవోపీఆర్డి దాసి సీతారామరాజు, గ్రామ ప్రముఖులు గుత్తికొండ సుభాష్ చంద్రబోస్, గుత్తికొండ సుబ్బారావు, గుత్తికొండ సత్యనారాయణ, గుత్తికొండ పట్టాభి సీతారామయ్య, యార్లగడ్డ సీతారామయ్య, కొడాలి బుజ్జి తదితరులు పాల్గొన్నారు.

