కాంగ్రెస్‌ బలోపేతానికి సైనికుల్లా పనిచేయాలి..

డీసీసీ అధ్యక్షుడు సంజీవ్‌ ముదిరాజ్‌

నవాబ్‌ పేట, ఆంధ్రప్రభ: కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని మహబూబ్‌నగర్‌ డీసీసీ అధ్యక్షుడు సంజీవ్‌ ముదిరాజ్‌ పిలుపునిచ్చారు. నవాబ్‌పేట మండల కాంగ్రెస్‌ కార్యవర్గ సమావేశం సోమవారం మండల కేంద్రంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సంజీవ్‌ ముదిరాజ్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి గడపకు తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. స్థానిక ఎమ్మెల్యే నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేయడం అభినందనీయమన్నారు. యువ నేతగా జడ్చర్ల నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమన్నారు.

బూత్‌ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తేనే రాబోయే ఎన్నికల్లో విజయం సాధించగలమని సంజీవ్‌ ముదిరాజ్‌ అన్నారు. నాయకుల మధ్య ఉన్న విభేదాలను పక్కనపెట్టి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పార్టీ కోసం ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని కోరారు. అనంతరం మండల కేంద్రంలో రమేష్‌ గౌడ్‌కు చెందిన ఎస్‌బీఆర్‌ రియల్‌ ఎస్టేట్‌ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు తానేం సురేష్‌, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ తులసీరాం నాయక్‌, సర్పంచుల సంఘం అధ్యక్షుడు సంతోష్‌ నాయక్‌, జిల్లా, మండల నాయకులు రాంచంద్రయ్య, జహీర్‌ అక్తర్‌, ధార భాస్కర్‌, బంగ్లా రవి, వాసు యాదవ్‌, రమేష్‌ గౌడ్‌, శ్రీహరి, ఆనంద్‌, రాజేష్‌తో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.