కన్నతండ్రికి తలకొరివి పెట్టిన కుమార్తె..

నిజాంపేట, ఆంధ్రప్రభ ; మండల కేంద్రానికి చెందిన పల్లేరు బాలరాజు గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం అర్ధరాత్రి మరణించడం జరిగింది. బాలరాజుకు ముగ్గురు ఆడబిడ్డలు కావడం వారసుడు లేకపోవడంతో తన పెద్ద కూతురు బాలమణి తలకొరివి పెట్టడానికి ముందుకు వచ్చింది. మగ సంతానం లేకపోతే ఏంటి నేను లేనా అని ముందుకు వచ్చిన బాలమణిని చూసి గ్రామస్తులు కంటతడి పెట్టుకున్నారు. ఈ రోజుల్లో వారసుడు ఉన్న తల్లిదండ్రులను మంచిగా చూస్తారని నమ్మకం లేకుండా పోయింది. కొడుకు కన్నా కూతురే మిన్న అనేదానికి ఇదొక నిదర్శమని చెప్పుకోవచ్చు.

Leave a Reply