శ్రీ సరస్వతి దేవి అలంకరణలో జగన్మాత
అట్టహాసంగా దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు
మూలా నక్షత్రం రోజు భక్తుల కోలాహలం
దారులన్నీ అమ్మ చెంతకే..
అర్ధరాత్రి నుంచే భక్తుల భారీ క్యూ
ఉదయం 2 గంటల నుంచే దర్శన భాగ్యం
అమ్మ దర్శనానికి 8 గంటలకు పైగా సమయం
ప్రొటోకాల్ దర్శనాలు రద్దు
అన్ని మార్గాల్లోనూ ఉచిత దర్శనాలే…
హోల్డింగ్ ఏరియాలో కిక్కిరిసిన భక్తులు

( ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో ) : యుక్త యుక్త విచక్ష… జ్ఞానాన్ని వివెచనాశక్తి..జ్ఞాపకశక్తి.. కల్పనా నైపుణ్యం.. కవిత స్ఫూర్తి.. రచన శక్తి. ధరణాశక్తిని ప్రసాదించే కరుణామయి సరస్వతీదేవి. ముళ్లకాలను ఏలే జగన్మాత జన్మ నక్షత్రం మూలా నక్షత్రం రోజున కనకదుర్గమ్మ (Kanakadurgamma) వారు శ్రీ సరస్వతీదేవి (Goddess Saraswati) అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. నెమలి వాహనం మీద ధవళ వర్ణ వస్త్రాలను, అక్షమాలలు ధరించి. అభయముద్రతో వేణను రెండు చేతులతో ధరించి. చందన చర్చిత దేహంతో అమ్మవారు భక్తులకు సాక్షాత్కరిస్తున్నారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో శ్రీ విశ్వవసునామ సంవత్సర దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో ఎనిమిదవ రోజు ఆశ్వీయుధ శుద్ధ సప్తమి మూలా నక్షత్రం అమ్మవారి జన్మ నక్షత్రం రోజు సోమవారం శ్రీ కనకదుర్గమ్మ వారు శ్రీ సరస్వతీ దేవి అలంకరణలు భక్తులకు అనుగ్రహించారు.

ఉదయం 2 గంటల నుండి దర్శనం…
దసరా ఉత్సవాల్లో (Dussehra festivals) భాగంగా మూలా నక్షత్రం రోజున జగన్మాత శ్రీ సరస్వతి దేవి అలంకరణలో దర్శించుకునేందుకు భక్తులు ఆదివారం అర్ధరాత్రి నుండి క్యూలైన్లో ఎదురు చూస్తుండడంతో సోమవారం తెల్లవారుజామున రెండు గంటల నుండి అమ్మవారి దర్శన భాగ్యాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రం, దేశం నలుమూలలు తో పాటు దేశ విదేశాల నుండి పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రి కి చేరుకుంటున్నారు. అన్ని క్యూ లైన్లు నిండి ఉండడంతో పాటు హోల్డింగ్ ఏరియాలో కూడా భక్త జన సంద్రోహంతో కనిపించడం అమ్మ దర్శనానికి క్యూలైన్లో అవతల కిలోమీటర్ల మేర భక్తులు ఎదురుచూస్తున్నారు. జై దుర్గా జై జై దుర్గా అనే నామస్మరణ ఇంద్రగిరిల్లో మారుమోగుతుంటే దారులన్నీ అమ్మ చెంతకే అన్నట్లుగా భక్తజన సందోహం తరలివస్తున్నారు. ప్రోటోకాల్ దర్శనాలన్నీ రద్దుచేసి, అన్ని క్యూ లైన్ ల ద్వారా భక్తులను ఉచితంగా పంపిస్తున్నప్పటికీ కనకదుర్గమ్మ వారి దర్శనానికి సుమారు ఎనిమిది గంటలకు పైగా సమయం పడుతోంది. ప్రశాంత వాతావరణంలో క్యూ లైన్ లన్నీ సాఫీగా ముందుకు కదులుతున్నప్పటికీ వేల సంఖ్యలో తరలివస్తున్న భక్తుల రాకతో సోమవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి లక్షకు పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. క్యూలైన్లన్నీ నిండి ఉండడంతో కొందరి భక్తులను ఘాట్ రోడ్డు ద్వారా అప్పటికప్పుడు పంపించే ఏర్పాటు పోలీసులు చేస్తున్నారు.

వీఐపీల తాకిడి సరే సరి
మూల నక్షత్రం సందర్భంగా శ్రీ సరస్వతిదేవి అలంకారంలో దర్శనమిస్తున్న జగన్మాత దుర్గమ్మను దర్శించుకున్న కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్, శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రి కొలుసు పార్థసారథి, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, తుని ఎమ్మెల్యే యనమల దివ్య, విజయవాడ ఎంపీ కేశినేని శివనాధ్(చిన్ని) తో పాటు పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కార్పొరేషన్ చైర్మన్లు, జడ్జిలు సినీ రాజకీయ రంగ ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు.






