Dandepalli | రహదారి నిబంధనలు తప్పకుండా పాటించాలి

Dandepalli | రహదారి నిబంధనలు తప్పకుండా పాటించాలి

Dandepalli | దండేపల్లి, ఆంధ్రప్రభ : ప్రజలు రోడ్డు నిబంధనలు పాటిస్తేనే ప్రమాదాలను నివారించవచ్చని జిల్లా సహాయ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సూర్య తేజ పేర్కొన్నారు. ఈ రోజు మండలంలోని వెల్గనూర్, దండేపల్లి ఉన్నత పాఠశాలలో రోడ్డు భద్రత మాసోత్సవాలు పురస్కరించుకొని విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించడమే కాకుండా, రోడ్డు నియమ నిబంధనలు తెలుసుకోవాలన్నారు. 18 ఏళ్ళు నిండని పిల్లలు వాహనాలు నడిపితే తల్లిదండ్రులకు జైలు శిక్ష నడిపిన వారికి ఇతర శిక్ష పడుతుందని. పిల్లలు వాహనాలకు దూరంగా ఉండాలని కోరారు. తల్లిదండ్రులు వాహనంపై బయటకు వెళ్లే ముందు పిల్లల స్వయంగా తండ్రికి హెల్మెట్ ఇవ్వాలని పిలుపునిచ్చారు.. అనంతరం పదో తరగతి విద్యార్థులతో మాట్లాడుతూ… ఇప్పటినుంచి బాగా చదువుకుంటే ఉత్తమ ఫలితాలు వస్తాయి అని పేర్కొన్నారు. పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయుడు బొలిశెట్టి రాజన్న, ఉపాధ్యాయులు రజిని, వెంకట మల్లు, రాజమౌళి భూమన్న, గంగన్న తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply