బాల్క సుమన్ కు స్వాగతం..

బాల్క సుమన్ కు స్వాగతం..
దండేపల్లి, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లా జైల్ నుండి బుధవారం విడుదలైన చెన్నూరు మాజీ శాసనసభ్యుడు బాల్క సుమన్ కు దండేపల్లి మండలం మ్యాదరిపేట వద్ద బిఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా టపకాయలు పేల్చుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు బిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ అధికార బలంతో బాల్క సుమన్ పై అక్రమంగా కేసులు పెట్టి జైలులో వేశారని మండిపడ్డారు. అధికార బలంతో అక్రమ కేసులు నిలబడవని, రానున్న రోజులలో అధికార కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు.
