దమ్మపేట అడిషనల్ ఎస్సై బాలస్వామికి ఉత్తమ సేవా పతకం
దమ్మపేట, ఆంధ్రప్రభ : దమ్మపేట పోలీస్ స్టేషన్లో అదనపు ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న బాలస్వామి నాధం గురువారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా ఉత్తమ సేవా పతకం అందుకున్నారు. పోలీస్ శాఖలో ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును ప్రదానం చేశారు.
బాలస్వామిని అభినందించిన ఎమ్మెల్యే జారే
దమ్మపేట అడిషనల్ ఎస్సై బాలస్వామి నాధం ఉత్తమ సేవా పతకం అందుకున్న సందర్భంగా అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అభినందించారు. గండుగులపల్లి క్యాంపు కార్యాలయంలో బాలస్వామి నాధంను ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రజలకు సేవలందిస్తూ ఉత్తమ సేవా పతకం అందుకోవడం ప్రశంసనీయమన్నారు. భవిష్యత్తులో మరింత సమర్థవంతంగా విధులు నిర్వహిస్తూ ప్రజలకు సేవలందించాలని ఆకాంక్షించారు.
