CSK vs RCB | చెన్నైకి వరుస షాక్‌లు… పెవిలియ‌న్ క్యూ క‌ట్టిన బ్యాట‌ర్లు !

చెన్నై : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో భాగంగా నేడు సీఎస్కే – ఆర్సీబీ మ‌ధ్య జ‌రుగుతున్న మ్యాచ్ లో.. ఆర్సీబీ బౌల‌ర్లు అద‌ర‌గొడుతున్నారు. చెన్నైకి వ‌రుస షాకులిస్తూ.. కీల‌క బ్యాట‌ర్ల‌ను పెవిలియ‌న్ కు పంపుతున్నారు.

తొలుత బ్యాటింగ్ చేసిన బెంగ‌ళూరు.. చెన్నై ముందు 197 ప‌రుగుల టార్గెట్ సెట్ చేసింది. అయితే ఈ ఛేజ్ లో… 12.1వ ఓవ‌ర్లో య‌ష్ ద‌యాల్ బౌలింగ్ లో చెన్నైకి మేయిన్ పిల్ల‌ర్ గా నిలిచిన ర‌చిన్ ర‌వీద్ర (41) వద్ద క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అదే ఓవ‌ర్లో 5వ బంతికి శివం దూబే (19) ప‌రుగుల‌కు డ‌గౌట్ చేరాడు. దీంతో సీఎస్కే 80 ప‌రుగుల‌కే 6 వికెట్లు కోల్పోయింది.

ప్ర‌స్తుతం క్రీజులో ర‌వీంద్ర జ‌డేజా (1) అశ్విన్ ఉన్నారు. 13 ఓవ‌ర్ల‌కు చెన్నై స్కోర్ 81/6.

Leave a Reply