క్రషర్‌లో కార్మికుడు ఉరివేసుకుని మృతి
పాలకుర్తి, ఆంధ్రప్రభ: పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం జయ్యారం గ్రామ శివారులోని ఓ క్రషర్‌లో పనిచేస్తున్న ఒడిశాకు చెందిన దానేశ్వర్ (28) ఉరివేసుకుని మృతి చెందాడు. క్రషర్ వద్ద ఆయన మృతిచెందిన విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో బసంత్‌నగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు ఘటనకు సంబంధించిన వివరాలను నమోదు చేశారు. దానేశ్వర్ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు తెలిసింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
