Crop canal | కాలువకు మరమ్మతులు
Crop canal | పెడన, ఆంధ్రప్రభ : పుల్లపాడు ప్రాంత రైతాంగానికి సాగునీటిని అందించే పంట కాలువకు మరమ్మత్తులు నిర్వహించారు. మినప పైరుకు సాగునీటిని అందించేందుకు ఈ పంట కాలువ ఇబ్బందికరంగా ఉండడంతో నీటి సంఘం అధ్యక్షుడు గూడవల్లి భద్రాచలం సమస్యను శాసనసభ్యుడు కాగిత కృష్ణ ప్రసాద్ దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన సూచన మేరకు కాలువలో పేరుకు పోయిన తూడు గుర్రపు డెక్కలను తొలగించారు.

