Crime story | వీడని గండికోట రహస్యం… హంతకుల కోసం సెర్చింగ్..

హంతకులు కావలెను!
ప్రేమికుడు చంపాడా?
బంధువుల పరువు హత్య?
థర్డ్ పార్టీ ఉందా?
ఆధారాల్నీ లేపేశారు
ఇక ఫోన్ సీడీఆరే దిక్కు
జుట్టు పీక్కుంటున్న పోలీసులు

సెంట్రల్ డెస్క్, ఆంధ్రప్రభ :

కడప జిల్లా గండికోట లో (gandikota ) ఇంటర్ విద్యార్థి (Inter student ) వైష్ణవి (vyashnavi ) హత్య కేసు (murder case ) పీట ముడి వీడలేదు. ప్రేమికుడే చంపేశాడని బంధువులు ఆక్రోసిస్తుంటే, హంతకుడు (accused ) అతడు కాదని తొందరపడిన పోలీసులు (police ) ముందే నిర్ధారించారు. ప్రేమికుడి పాత్ర లేదని పోలీసు ఉన్నతాధికారి స్పష్టం చేశారు. ఇక మృతురాలు వైష్ణవి పెదనాన్న కొడుకు సురేంద్ర వైపే అన్ని వేళ్లు చూపిస్తూ అతడి అనుమానిస్తుంటే ఐతే, వైష్ణవి అన్న సురేంద్ర మాత్రం నా సొంత చెల్లెలు ప్రేమ పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. నేను ఏమి అనలేదు. మా బాబాయ్ కూతురు చనిపోయిన బాధలో మేముంటే ఈ నిందలతో వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ విచారణకైనా సిద్ధం. పోలీసుల దర్యాప్తునకు సహకరిస్తా .. సీసీ పుటేజీ చూడండి. కాల్ డేటా చెక్ చేయండని అన్న సురేంద్ర చెబుతున్నాడు. ఇంతకీ ఇంటర్ వైష్ణవిని హతమార్చిన అదృశ్య శక్తి ఎవరు? మూడో హస్తం ఉంటే.. ఈ థర్డ్ పార్టీని రంగంలోకి దించిందెవరు? ఇటు ప్రేమికుడు, అటు వైష్టవి బంధువుల కథనాల్లో నిజం ఎంత? అసలు ఈ నెల 14న గండికోటలో ఏమి జరిగింది? ఇత్యాధి ప్రశ్నలతో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

చిన్నానాటి ప్రేమతోనే..

కడప జిల్లా ఎర్రగుంట మండలం హనుమ గుత్తి గ్రామానికి చెందిన వైష్ణవి, లోకేష్ మధ్య ఐదేళ్లుగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. లోకేష్ పదవ తరగతి తప్పాడు. వైష్ణవి పాస్ కావటం.. ఊళ్లో లోకేష్ ఒక జులాయి అనే ముద్ర కారణంగా… అతడిని కలవొద్దని కుటుంబం మందలించినా, అదిరించినా, బెదిరించినా వైష్ణవి ఎక్కడ తగ్గలేదు. ఏమీ చేయలేని స్థితిలో.. కనీసం వీరిద్దరినీ దూరం చేయాలని తమ కుటుంబాన్ని ప్రొద్దుటూరుకు మార్చారు. వైష్ణవిని గీతం జూనియర్ కాలేజీలో చేర్చారు. ప్రస్తుతం ఆమె సెకండ్ ఇంటర్ చదువుతోంది.

ఆరోజు కాలేజీకి వెళ్లిన వైష్ణవి …

జులై 14న (సోమవారం) ఉదయం 8 గంటలకు వైష్ణవి కాలేజీకి వెళ్లింది. వైష్ణవి కాలేజీకి రాలేదని ఉదయం తొమ్మిది గంటలకు యాజమాన్యం ఫోన్ చేసి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఉదయం 8 గంటలకే తమ కుమార్తె కాలేజీకి వచ్చిందని కుటుంబ సభ్యులు కాలేజీ వద్దకు వచ్చి విచారించారు. ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు, కుటుంబ సభ్యులు గండికోటకు వెళ్లి వెతికారు. సాయంత్రం వరకు ఎలాంటి ఆనవాళ్లు దొరకలేదు . సాయంత్రం గండికోట పై భాగంలో వైష్ణవి కాలేజీ బ్యాగు , చున్నీ కనిపించాయి. గండికోట పరిసర ప్రాంతాల్లో వెతికిన విద్యార్థిని జాడ లభించలేదు. లోకేష్ తీసుకు వెళ్లాడని వైష్టవి కుటుంబ సభ్యులు అనుమానించారు. ఈ స్థితిలో పోలీసులు లోకేష్ ను అదుపులోకి తీసుకుని విచారించారు. మంగళవారం మళ్లీ ఆమె కోసం పోలీసులు గండికోటలో వెతికారు. ధాన్యాగారం పక్కన ముళ్ల పొదల్లో వివస్త్ర స్థితిలో యువతి మృతదేహం కనిపించింది. ఆమె వైష్ణవి అని బంధువులు గుర్తించారు. ఈ సమాచారంతో జమ్మలమడుగు, ప్రొద్దుటూరు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ చేరుకున్నాయి. కడప జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ హుటాహుటిన గండికోటకు చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి దర్యాప్తు ముమ్మరం చేశారు.

సీసీ పుటేజీలో తొలి ఆధారం

ఆధారాల సేకరణలో పోలీసు బృందాలు బిజీబిజీ కాగ. ప్రాథమిక సమాచారం మేరకు, ఉదయం 8.00 గంటలక కాలేజీ వెళ్తున్నట్టు చెప్పిన వైష్ణవి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ప్రొద్దుటూరులోనే ఉదయం 8:30 గంటల సమయంలో ఎర్రగుంట్ల మండలం హనుమనగుత్తి గ్రామానికి చెందిన లోకేష్ బైక్ పై వైష్ణవి ఎక్కింది. . సోమవారం ఉదయంఉదయం 8. 38 గంటలులోకేష్ తో కలిసి వైష్ణవి బైక్ లో వెళుతున్న దృశ్యం గండికోటకు రెండు కిలోమీటర్లకు ముందే ఉన్న చెక్ పోస్ట్ లోని సీసీ టీవీలో రికార్డు అయింది. ఉదయం 10. 37 గంటలకు లోకేష్ ఒక్కడే బైక్లో తిరిగి రావడం సీసీటీవీ లో నమోదైంది. ఈ దృశ్యాలు సీసీ ఫుటేజీలో రికార్డు అయ్యాయి. మృతదేహం లభించిన క్రైమ్ సీన్ పరిశీలించిన పోలీసులు వైష్ణవి మరణం అనుమానస్పద మృతి కాదని, మర్డరేనని ఓ నిర్ధారణకు వచ్చారు. ఈ హత్యలో పాల్గొంది ఒక్కరేనా.. మరి కొందరు ఉన్నారా? వైష్ణవిపై సామూహిక లైంగిక దాడి జరిగిందా? అనే కోణంలో విచారణ జరిపారు. పోస్టుమార్టం ప్రాథమిక నివేదికతో పోలీసులు అవాక్కయ్యారు. ఆనుమానితుడు లోకేష్ మాత్రం తాను వైష్ణవిని ప్రాణంతో సమానంగా ప్రేమించానని, తాను హత్య చేయలేదని, తాము గండికోటలో మాట్లాడుతుండగా వైష్ణవి బంధువులు ఫోన్ చేశారని, అక్కడే ఉండు వస్తున్నాం, చంపేస్తాం, అని బెదిరించగా.. తాను బైక్ పై పారిపోయానని పోలీసులకు చెప్పాడని ఓ కథనం వినిపిస్తే.. కాదు లోకేష్ బంధువులకు వైష్ణవి అన్న ఫోన్ చేయగా.. లోకేష్ కుటుంబ సభ్యులే అతడిని అలెర్ట్ చేశారని, మా వాళ్లు వస్తే నిన్ను చంపేస్తారు, వెళ్లిపో అని వైష్ణవి పంపించిందని మరో కథనం వినిపిస్తోంది. అంటే.. ఈ జంటను పట్టు కోవటానికి వైష్ణవి కుటుంబ సభ్యులు గండికోటకు చేరుకున్నారని తెలుస్తోంది.

ఇక ట్విస్టులు… మీద ట్విస్టులు

ఇక వైష్ణవి పోస్టుమార్టం రిపోర్టు పోలీసులను నివ్వెర పర్చింది. ఆమెపై అత్యాచారం జరగలేదని ప్రాథమిక సమాచారం అందింది. కర్నూలు డీఐజీ ఇదే విషయాన్ని వెల్లడించారు. ఆమె మద్యాహ్నం 12.00 గంటల వరకూ బతికే ఉందని వైద్యులు నిర్ధారించారు. సాయంత్రం 7.00 గంటల లోపు మృతి చెందినట్టు వైద్యులు అనుమానించారు. ఇక ఆమె చాతిపై బలమైన దెబ్బ తగిలిందని, ముక్కు పగిలిపోయిందని, అరికాలిపై గాయం ఉందని, కుడి చెవి పోగు లేదని.. అంటే ఆమెపై తీవ్రమైన దాడి జరిగిందని ప్రాథమికంగా వైద్యులు సమాచారం ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఇక్కడే అసలు ట్విస్టు వెలుగు చూసింది. లోకేష్, వైష్ణవి రెండు గంటల పాటు ఓ హోటల్ లో ఉన్నారు. ఫోన్ వచ్చిన తరువాత లోకేష్ 10.30 గంటలకే లాడ్జీ నుంచి బయటకు వెళ్లాడు. అంటే.. వీరిద్దరూ మాట్లాడుకున్నారే గానీ శారీరకంగా కలవలేదు. అదే జరిగి ఉంటే అమెపై అత్యాచారం జరిగినట్టు వైద్యులు నివేదించటం ఖాయం. పైగా ఆమె మృతదేహం లభించిన తీరులో.. వివస్త్ర స్థితిలో ఆమె మృతదేహం లభించింది. కాబట్టి లైంగిక దాడి జరిగనట్టు అనుమానం తప్పనిసరి. ఇక లోకేష్ అత్యాచారం చేసి చంపేసినట్టు సీన్ క్రియేట్ చేశారు. అత్యాచారం జరిగినట్టు తేలితే.. సెమెన్‌ పరీక్షలతో లోకేష్ ప్రధాన నిందితుడయ్యేవాడు. కానీ ఇక్కడ హంతకుల ప్లాన్ తిరగబడింది.

ఇంతకీ హంతకులెవరు?

లవర్ లోకేష్ కాదు, వైష్ణవి బంధువులు కాదు. మరి ఆమెను హతమార్చిన కిరాతకులెవ్వరు? ఆమె దుస్తువులను తీశారు. అత్యాచారం చేయలేదు. ఒకవేళ వాళ్ల దాడిలో చనిపోతే.. వదిలేసి వెళ్లిపోయారా? ఇక ఆ శవాన్ని పొదల్లోకి తీసుకువెళ్లిన హంతకులు కనీసం వేలి ముద్రలు దొరక్కుండా ఎలా తప్పించుకున్నారు. ఆ పొదల్లోకి శవాన్ని తీసుకువెళ్తుంటే.. పొదల బయట కనీసం పాద ముద్రలు కూడా దొరక్కుండా ఏం ప్లాన్ చేశారు? అంటే.. ఈ మర్డర్ చేసింది కిరాయి హంతకులేనా? ఏమో కావొచ్చు. ప్రొఫెషనల్ కిల్లర్స్ మాత్రమే నేరాల ఆధారాలను తప్పించగలరు. ఇదే నిజమైతే.. సుఫారీ ఎవ్వరు ఇచ్చారు. నిజంగా గండికోటలో సీనియర్ కిల్లర్స్ ఉన్నారా? లేక సన్నిహితులే సాక్ష్యాలు లేని పక్కా ప్లాన్ రచించారా? ఇక బంధువులు, లోకేష్ ఫోన్ కాల్ డేటా మాత్రమే ఈ కేసు చిక్కుముడిని విప్పుతుందా? ఇవీ ప్రస్తుతం వైష్ణవి మర్డర్ కేసులో సమాధానాలు దొరని ప్రశ్నలు.

Leave a Reply