హైదరాబాద్: హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఫలక్‌నామా రౌడీ షీటర్ మాస్ యుద్దీన్ దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని దుండగులు..అతడిపై దాడి చేసి హత్యకు పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు.
వివరాల ప్రకారం.. ఫలక్‌నామా రౌడీషీటర్ మాస్ యుద్ధీన్ ఆదివారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. రెయిన్‌బజార్‌లో కొందరు వ్యక్తులు మాస్‌యుద్దీన్‌పై కత్తితో దాడి చేసి అతడిని హతమార్చారు. అయితే, అతడి ప్రత్యర్థులే యుద్ధీన్‌ను హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ఇదిలా ఉండగా.. మాస్ యుద్దీన్‌కు మూడు రోజుల క్రితమే వివాహం జరిగింది..