Crime News | విజయవాడలో ఇద్దరు యువకులు దారుణ హత్య

విజయవాడలో (Vijayawada ) పట్టపగలే (day light ) .. నగర నడిబొడ్డున నేడు ఇద్దరు యువకులు (two persons ) దారుణ హత్యకు (brutally murder ) గురయ్యారు.. రక్తపు మడుగులో పడి ఉన్న రెండు మృతదేహాలు చూసి స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.. కత్తితో పొడిచి వారిని హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు.
హత్యకు గురైన వారు క్యాటరింగ్ పని చేసే యువకులుగా తేల్చారు.. అయితే, మృతులు మద్యం మత్తులో ఉన్నట్టు గుర్తించారు పోలీసులు.. మొదట ఎవరు హత్య చేసేశారని విషయంపై క్లారిటీ రాకపోగా.. చివరకు ఈ కేసు కీలక మలుపు తీసుకుంది.. రెండు హత్యలు చేసింది రౌడీషీటర్‌గా గుర్తించారు.. ఇక, హత్యకు గురైన యువకులు విజయనగరం, విజయవాడకు చెందిన వారిగా చెబుతున్నారు.. మొత్తంగా విజయవాడలో రెండు హత్యలు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి.. అయితే, గవర్నర్ పేటలో క్యాటరింగ్ చేసే యువకులు ఓ ఇంట్లో అద్దెకు ఉంటుండగా.. వీరి దగ్గరికి వచ్చిన రౌడీ షీటర్ కిషోర్.. వాగ్వాదానికి దిగాడని.. గొడవ ముదరడంతో కత్తితో ఇద్దరు యువకులను దారుణంగా పొడిచి హత్య చేసినట్టుగా చెబుతున్నారు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన బెజవాడ పోలీసులు.. రౌడీ షీటర్ కిషోర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు..
