Madhya Pradesh: ఉజ్జయిని మహాకాళేశ్వరుడి సేవలో టీమిండియా క్రికెటర్లు..

Madhya Pradesh: భారత క్రికెటర్లు కుల్దీప్ యాదవ్, తిలక్ వర్మలతో పాటు ప్రముఖ హాకీ క్రీడాకారుడు వివేక్ సాగర్ ప్రసాద్ మధ్యప్రదేశ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయాన్ని సందర్శించారు. స్వామివారి ప్రత్యేక పూజల్లో పాల్గొని ఆశీస్సులు అందుకున్నారు. వీరితో పాటు టీమిండియా సపోర్ట్ స్టాఫ్ సభ్యులు కూడా మహాకాళేశ్వరుడిని దర్శించుకున్నారు.

అలయ సందర్శన అనంతరం స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మాట్లాడుతూ.. “మహాకాళేశ్వరుడిని దర్శించుకోవడం చాలా గొప్ప అనుభూతిని ఇచ్చింది. నాకు సమయం దొరికినప్పుడల్లా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటాను. ఇది నాకు అపారమైన ప్రశాంతతను, ఆనందాన్ని ఇస్తుంది. ఈరోజు తిలక్ వర్మ, మా టీమ్ సపోర్ట్ స్టాఫ్ కూడా మాతో ఉన్నారు. మేము నిలకడగా మంచి క్రికెట్ ఆడుతూ, అన్ని క్రీడల్లోనూ దేశం ముందుకు సాగాలని కోరుకుంటున్నాం. భగవంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ మాపై ఉండాలని ప్రార్థించాం” అని పేర్కొన్నారు.