సీపీఎం నేత రామారావు హ‌త్య‌

ఖమ్మం బ్యూరో , ఆంధ్ర‌ప్ర‌భ : ఖమ్మం జిల్లాలోని మధిర నియోజకవర్గ పరిధిలో చింతకాని మండలం పాతర్లపాడుకు చెందిన సీపీఎం నేత (CPM Leader), రైతు సంఘం నేత, మాజీ సర్పంచ్ సామినేని రామారావు దారుణ హత్యకు గురయ్యాడు. ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు ఈ రోజు తెల్లవారుజామున ఇంట్లోకి ప్రవేశించి గొంతు కోసి హతమార్చారు. అదే నియోజకవర్గంలో 20 నెలల క్రితం ఎల్ గోవిందాపురం గ్రామంలో సీపీఎం నేత ఎర్రబోయిన నాగేశ్వరరావు (Nageswara Rao)ను దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. తాజాగా జరిగిన హత్యతో చింతకాని మండలంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

మధిర నియోజకవర్గ పరిధిలోని చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో సీపీఎం సీనియర్ నేత సామినేని రామారావు రాజకీయ హత్యకు గురికావడంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. దోషులను చట్టపరంగా శిక్షిస్తామని పేర్కొన్నారు. కలుషిత హింస రాజకీయాలకు తావు లేదు అని డిప్యూటీ సీఎం అన్నారు. శాంతిభద్రతలపై ఖమ్మం పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. క్లూస్ టీం, శ్రీ ఫర్ డాగ్స్, సైబర్ టీం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అన్ని మార్గాలను ఉపయోగించి నిందితుల‌ను వెంటనే అరెస్ట్ చేయాలి అని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. సీనియర్ నేత సామినేని రామారావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలిపారు. రామారావు కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని, పూర్తిస్థాయిలో ఆదుకుంటానని భరోసా ఇచ్చారు.

Leave a Reply