ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని పిలుపు
టీజీఐసీసీసీ, సీసీఎస్‌లో ఏర్పాటు చేసిన వినాయక మండపాల్లో పూజలు
పోలీస్ అధికారులు, సిబ్బందితో కలిసి పాల్గొన్న హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్
గణేష్ ఉత్సవాలు, నిమజ్జనం ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలని విజ్ఞప్తి
వినాయకుడికి హైదరాబాద్ సిటీ పోలీసుల ప్రత్యేక పూజలు
హైదరాబాద్, ఆంధ్రప్రభ: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీ, బషీర్‌బాగ్‌లోని సీసీఎస్‌లో ఏర్పాటు చేసిన గణనాథుడి పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సిటీ పోలీస్ ఉన్నతాధికారులు, సిబ్బందితో కలిసి గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో నగర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

వినాయక చవితి సందర్భంగా హైదరాబాద్ సిటీ పోలీసుల తరఫున నగర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గణేష్ ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు. భక్తులు, మండపాల నిర్వాహకులు నిబంధనలు పాటిస్తూ పండుగను ఆనందోత్సాహాలతో నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.


