Cows | ఫ్రీగా పాలు..

Cows | ఫ్రీగా పాలు..
- 300 ఆవుల ద్వారా వచ్చే పాలు..
- 3 కోట్ల రూపాయలతో షెడ్డు నిర్మాణం..
- రూ 2 లక్షల ఖర్చు..
Cows | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : సొంతంగా గోశాలను ఏర్పాటు చేసుకున్నాడా వ్యక్తి. సుమారు మూడు కోట్ల రూపాయలతో సొంత ఖర్చుతో షెడ్డు వేసి నెలకు రెండు లక్షల రూపాయల వరకు ఖర్చు చేస్తున్న వ్యక్తి సేవా కార్యక్రమాలు చేస్తూ.. అందర్నీ ఆకట్టుకుంటున్నాడు. ఇది నంద్యాల జిల్లాలో చోటుచేసుకుంది. బుధవారం ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే… నంద్యాల జిల్లా బనగానపల్లెకు చెందిన బుర్ర వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాగంటి క్షేత్రానికి సమీపంలో గోశాలను నిర్మించారు. గోశాలలో 300 ఆవులను పోషిస్తున్నారు. మీ ఆవుల ద్వారా వచ్చే పాలను ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా జిల్లాలోని వివిధ దేవాలయాలకు, భక్తులకు ధార్మిక సంస్థలకు ఉచితంగా పంపిణీ చేస్తున్నాడు. గత రెండు సంవత్సరాలుగా ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టటం విశేషం.
గత రెండు సంవత్సరాల క్రితం యాగంటి క్షేత్రానికి సమీపంలో గోశాలను, మూడు కోట్ల రూపాయలతో షెడ్డుని వేశాడు. ఆ షెడ్డులో 300 ఆవులను పెంచుతున్నారు. వీటికి నెలకు రెండు లక్షల రూపాయల వరకు గోశాలకు ఖర్చు చేస్తున్నారు. ఈ గోశాలలో పని చేయడానికి సుమారు 15 మందికి జీతాలు ఇచ్చి కూడా వ్యక్తులను పెట్టుకున్నారు. ఆవులను శుభ్రం చేయటంతో పాటు పశువులకు దానాలను మేతను వేయటానికి వీరిని సొంత ఖర్చులతో నియమించుకోవడం విశేషం. ఈ 300 ఆవుల నుంచి సేకరించిన పాలను సొంత ఖర్చులతో వివిధ ప్రాంతాలకు తరలించి భక్తులకు, కార్మిక సంస్థలకు, దేవాలయాలకు సరఫరా చేయటం విశేషం. ఇతని సేవా కార్యక్రమాలను చూసి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అతన్ని అభినందిస్తున్నారు.
