మల్లికార్జున ఖర్గేను కలిసిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
ఢిల్లీలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడితో మర్యాదపూర్వక భేటీ
వికారాబాద్, ఆంధ్రప్రభ : స్పీకర్ల సదస్సులో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ మంగళవారం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఖర్గేకు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ భేటీలో ఇరువురు నేతలు పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం. స్పీకర్ల సదస్సులో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చిన సందర్భంగా ఖర్గేను ప్రసాద్ కుమార్ కలిశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు గూడెం రాములు యాదవ్, సీనియర్ నాయకులు అనిల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
