Counter Attack | ఉగ్ర వేట ప్రారంభించిన ఆర్మీ … ఇద్ద‌రు టెర్ర‌రిస్టులు హ‌తం

జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో ఉగ్ర దాడికి ప్రతీకారం తీర్చుకోవడానికి భద్రతా దళాలు వేటను ముమ్మరం చేశాయి. భారత్‌లో ప్రవేశించేందుకు బుధవారం ప్రయత్నిస్తున్న ఉగ్రవాదులను సైన్యం గుర్తించింది. ఈక్రమంలో ఎన్‌కౌంటర్‌ మొదలైనట్లు చినార్‌ కోర్‌ ఎక్స్‌ ఖాతాలో ప్రకటించింది. ఇద్దరు లేదా ముగ్గురు ఉగ్రవాదులు ఉరి నాలా వద్ద సర్జీవన్‌ అనే ప్రదేశం నుంచి దేశంలోకి ప్రవేశిస్తుండగా ఇది మొదలైంది. ప్రస్తుతం ఆపరేషన్‌ కొనసాగుతోంది. ఇప్పటివరకు ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టినట్లు ఆర్మీ వెల్లడించింది. ఘటనాస్థలంలో భారీగా మందుగుండు సామగ్రి, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది

Leave a Reply