కర్నూలు జిల్లాలో రౌడీ షీట‌ర్ల‌కు కౌన్సిలింగ్‌

కర్నూలు జిల్లాలో రౌడీ షీట‌ర్ల‌కు కౌన్సిలింగ్‌

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ :నేర ప్రవృత్తులకు స్వస్తి పలికి, సత్ప్రవర్తనతో జీవించాలని లేకుంటే బెండు తీస్తామ‌ని క‌ర్నూలు పోలీసులు రౌడీ షీట‌ర్ల‌కు హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్(District SP Vikrant Patil) ఆదేశాల మేరకు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీ షీటర్లు, నేరచరిత్ర కలిగినవారు, చెడు నడత గల వ్యక్తులకు పోలీసులు కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహించారు.

చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు దూరంగా ఉండాలనే హెచ్చరికతో పాటు, చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలకు లోనవుతారని స్పష్టం చేశారు. పోలీసు అధికారులు తెలిపిన ప్రకారం జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ(Maintenance of Law and Order)కు, నేర నియంత్రణకు ఈ తరహా కౌన్సిలింగ్(Counselling) కార్యక్రమాలు కొనసాగుతాయ‌ని చెప్పారు. చట్టప్రకారం ప్రతి ఒక్కరితో సమానంగా వ్యవహరిస్తామని తెలిపారు.. ఈ చర్యతో నేరవృత్తిని విడిచిపెట్టేలా అవగాహన పెరగడం, శాంతి భద్రతలు బలోపేతం కావడంలో ఇది కీలకమవుతుందని అధికారులు వివరించారు.

Leave a Reply