Counseling | రౌడీ షీటర్లకు ఎస్ఐ స్ట్రాంగ్ వార్నింగ్
Counseling | గుడివాడ, ఆంధ్రప్రభ : గుడివాడ రూరల్ పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్లకు ఎస్ఐ చంటిబాబు ఆదివారం కౌన్సెలింగ్ ఇచ్చారు. రౌడీ షీటర్లు నేరాలు, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఎస్ఐ సూచించారు. బాధ్యతాయుత పౌరులుగా మారి, చట్టాలను గౌరవించాలని వారికి అవగాహన కల్పించారు. ప్రజలతో సఖ్యతగా ఉండాలని, గొడవలకు దూరంగా ఉండాలని సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

