councilors |సింగరేణి కార్మికులే కౌన్సిలర్లు!

councilors |సింగరేణి కార్మికులే కౌన్సిలర్లు!

బెల్లంపల్లిలో ఇద్దరు కార్మిక నేతలు ఘన విజయం

councilors | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ: బెల్లంపల్లి మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల తీర్పు మరోసారి కార్మిక వర్గం శక్తిని చాటింది. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్లో పని చేసే ఇద్దరు కార్మికులు మున్సిపల్ కౌన్సిలర్లుగా గెలుపొంది పట్టణ రాజకీయాల్లో కొత్త చరిత్ర లిఖించారు. పోస్టాఫీస్ బస్తికి చెందిన 16వ వార్డు నుంచి మత్తమారి రాయమల్లు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఆయన మందమర్రి ఏరియాలోని కళ్యాణ్ ఖని ఓపెన్‌కాస్ట్‌లో జనరల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు.అలాగే బూడిదగడ్డ బస్తికి చెందిన 21వ వార్డు నుంచి రాజనాల రమేష్ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు.


ఆయన మందమర్రి ఏరియాలోని కాసిపేట–1 బొగ్గు గనిలో ట్రబ్ రిపేర్ మజ్దూర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఓ వైపు సింగరేణి కార్మికులుగా విధులు నిర్వహిస్తూ నేడు వీరిద్దరూ ప్రజల మద్దతుతో ప్రజాప్రతినిధులుగా ఎదగడం పట్టణ ప్రజలలో విశేష చర్చకు దారి తీసింది. ముఖ్యంగా 21వ వార్డు కౌన్సిలర్ రాజనాల రమేష్ భార్య బడికల కమల ఇదే వార్డు నుంచి 2005, 2014 సంవత్సరాల్లో రెండు సార్లు బీఆర్ఎస్ తరపున కౌన్సిలర్‌గా గెలిచి పనిచేసిన నేపథ్యం ఉండటం రాజకీయ ప్రాధాన్యతను మరింత పెంచింది.ఈ సందర్భంగా మత్తమారి రాయమల్లు, రాజనాల రమేష్‌లు ‘ఆంధ్రప్రభ’తో మాట్లాడుతూ –“కార్మికులుగా పని చేస్తూనే ప్రజల విశ్వాసంతో ప్రజాప్రతినిధులుగా గెలవడం గర్వకారణం. మా వార్డుల అభివృద్ధే లక్ష్యంగా పారదర్శకంగా పనిచేస్తాం. ప్రజల సహకారంతో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం” అని స్పష్టం చేశారు.

Leave a Reply