Councilors | నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం

Councilors | నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం
Councilors | ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ నూతన పాలకవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమం సోమవారం జరిగింది. మున్సిపల్ ఎన్నికల ప్రత్యేక అధికారి, ఆర్డీవో కృష్ణారెడ్డి, సహాయ ఎన్నికల అధికారి కె శ్రీనివాసరెడ్డి సమక్షంలో నూతన కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు.
ప్రమాణ స్వీకారం చేసిన వారిలో కౌన్సిలర్లు బీజన బాలమణి, మల్లెల సరిత, అంగడి ఆంజనేయులు, పస్తం ఆంజనేయులు , జూకంటి సంపత్, జట్ట నీరజ, వానరాశి మరియమ్మ ప్రమాణం చేసిన వారిలో ఉన్నారు. తహసీల్దార్ వలిగొండ ఆంజనేయులు తదితరులు ఉన్నారు.

