Councillor | కడియం శ్రీహరి ఆశీస్సులతో ముందుకు..

Councillor | కడియం శ్రీహరి ఆశీస్సులతో ముందుకు..


ఎమ్మెల్యేను కలిసిన 18వ వార్డు కౌన్సిలర్ పొన్న రవి

Councillor | స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ: స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీలో 18వ వార్డు నుంచి నూతనంగా గెలుపొందిన కౌన్సిలర్ పొన్న రవి మంగళవారం ఎమ్మెల్యే కడియం శ్రీహరిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సంద ర్భంగా ఎమ్మెల్యేకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల్లో విజయం సాధించిన తనకు రాజకీయ ప్రస్థానానికి మార్గదర్శ కుడైన కడియం శ్రీహరి ఆశీస్సులు తీసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. తనపై నమ్మకం ఉంచి అవకాశం కల్పించినందుకు కృత జ్ఞతలు తెలిపారు. తాను కడియం శ్రీహరి ఆశయాలకు అనుగుణంగా పని చేస్తూ, పార్టీ బలోపేతానికి వార్డు అభివృద్ధికి కట్టుబడి ఉంటా నని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే నాయకత్వంలోనే ప్రజలకు సేవ చేసే అవకాశ మొచ్చిందని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply