ఆంధ్రప్రభ, హైదరాబాద్ : రజనీకాంత్(Rajinikanth) హీరోగా, లోకేశ్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వంలో తెరకెక్కిన కూలీ(Coolie) సినిమా సినీప్రియుల దృష్టిని ఆకర్షించింది. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున(Nagarjuna) ఇందులో విలన్‌గా కనిపించగా, సన్ పిక్చర్స్ బ్యానర్(Sun Pictures banner)పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
ప్రముఖ నటులు ఆమీర్ ఖాన్, శృతి హాసన్, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, పూజా హెగ్డే, సత్యరాజ్ కీలక పాత్రల్లో నటించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సాధారణ స్థాయిలోనే కలెక్షన్స్ నమోదు చేసింది.
ఇక థియేటర్లలో చూసే అవకాశం కోల్పోయిన వారికి గుడ్ న్యూస్. కూలీ డిజిటల్ ప్రీమియర్ డేట్ లాక్ అయింది. సెప్టెంబర్ 11 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్(Amazon Prime) తమ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది.