తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు..
రూ.55 కోట్లతో 5 ఈఎల్‌ఎస్‌ఆర్, ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంకుల నిర్మాణం
భవానిపురం, ఆంధ్రప్రభ: పశ్చిమ నియోజకవర్గ ప్రజల తాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు, కొత్త తాగునీటి వాటర్ ట్యాంకుల నిర్మాణానికి ఎమ్మెల్యే సుజనా చౌదరి త్వరలో శంకుస్థాపన చేయనున్నారు. భవానిపురం లారీ స్టాండ్ ప్రాంతంలో నూతనంగా నిర్మించనున్న వాటర్ ట్యాంకుల నిర్మాణ ప్రాంతాన్ని కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, ఈఈ శ్రీనివాస్, మెగా ఇంజనీరింగ్ అధికారులు మంగళవారం పరిశీలించారు. పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు తాగునీటిని అందించేందుకు రూ.55 కోట్లతో 5 ఈఎల్‌ఎస్‌ఆర్, ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంకుల నిర్మాణం చేపట్టనున్నట్లు కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ తెలిపారు. ఈ నెల 21న ఎమ్మెల్యే సుజనా చౌదరి వాటర్ ట్యాంకుల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈలు జనార్ధన్, ఇస్మాయిల్, జాస్మిన్ తదితరులు పాల్గొన్నారు.
