తెలంగాణలో రాజ్యాంగ వ్యతిరేక పాలన…

తెలంగాణలో రాజ్యాంగ వ్యతిరేక పాలన…

  • కామారెడ్డి ఘటనపై నిందితులను కఠినంగా శిక్షించాలి
  • నిరసన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు కొండయ్య

మక్తల్, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ చేతిలో రాజ్యాంగం పుస్తకాన్ని పట్టుకొని తిరుగుతుంటే తెలంగాణలో మాత్రం రాజ్యాంగ వ్యతిరేకంగా కాంగ్రెస్ పాలన కొనసాగుతుందని మక్తల్ మాజీ ఎంపీపీ బిజెపి రాష్ట్ర నాయకులు కొండయ్య అన్నారు. రాజ్యాంగ వ్యతిరేక పాలనపై రాహుల్ గాంధీ స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.

కామారెడ్డిలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లను ఓడించి గెలిచిన వెంకటరమణారెడ్డికి హక్కులకు అడ్డు తగులుతూ కాంగ్రెస్ ప్రభుత్వం షబ్బీర్ అలీ అనే వ్యక్తిని డమ్మిగా పెట్టి అధికారిక కార్యక్రమాల్లో అవకాశం కల్పించడాన్ని రాజ్యాంగ వ్యతిరేక చర్యగా ప్రజాస్వామ్యవాదులంతా భావిస్తున్నారని అన్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పై దాడిచేయడాన్ని అదేవిధంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ,పార్లమెంటు సభ్యుడు ఈటెల రాజేందర్ లను అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ మక్తల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బిజెపి నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామారెడ్డి ఎమ్మెల్యే కు వ్యతిరేకంగా పెబ్బేర్ అలీ గుండాయిజం చేచడాన్ని సహించబోమని ఆయన హెచ్చరించారు. కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి చేసి ఆస్తి నష్టం చేసిన గుండాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కొండయ్య డిమాండ్ చేశారు .నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలను కాదని కాంగ్రెస్ ప్రభుత్వం డమ్మిలను పెట్టి అధికారాన్ని చెల్లించాలని చూస్తే సహించబోమని ఆయన హెచ్చరించారు.

కామారెడ్డి ఘటన అనంతరం ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిని పరామర్శించేందుకు వెళుతున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ ను అక్రమంగా గృహ నిర్బంధం చేసే అరెస్టు చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాజ్యాంగబద్ధంగా పాలించడం చేతకాకపోతే అధికారం నుండి దిగిపోవాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షులు బి.రాజశేఖర్ రెడ్డి, నాయకులు దేవరింటి నర్సింహారెడ్డి, కర్ని స్వామి ,జి.బలరాం రెడ్డి,డాక్టర్ శ్రీనివాసరెడ్డి ,సుకన్య శేఖర్,రాజా గౌడ్,ఆడెం సత్యనారాయణ ,నరేందర్, బ్యాటరీ రాజు, మున్సిపల్ కౌన్సిలర్ పికే. నరసింహ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply