Constituency | నీటి సరఫరాలో అంతరాయం

Constituency | నీటి సరఫరాలో అంతరాయం
- ఈఈ సురేష్
Constituency | వికారాబాద్, ఆంధ్రప్రభ : జనవరి 7 నుండి జనవరి 11వరకు తాగునీటి సరఫరాలో అంతరాయం ఉంటుందని మిషన్ భగీరథ
ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(Executive Engineer) సురేష్ ఈ రోజు ఒక ప్రకటనలో తెలిపారు.
ఎల్లూరు నుంచి గౌరిదేవిపల్లి వద్ద వాల్వ్ మరమ్మత్తుల నిర్వహణ కారణంగా ముడి నీరు రానందున వికారాబాద్, తాండూర్, పరిగి నియోజకవర్గ(Constituency) పరిధిలో ఉన్నా మున్సిపాలిటీ, గ్రామాలకు నీటి సరఫరా చేయలేకపోతున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలు ఈ అంతరాయాన్ని గుర్తించి సహకరించ వలసిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు.
