బాధిత కుటుంబానికి పరామర్శ.. ఆర్థిక సహాయం
వెల్దండ, ఆంధ్రప్రభ: వెల్దండ మండల కేంద్రానికి చెందిన నాగిళ్ళ భారతమ్మ గత కొద్ది రోజుల క్రితం గుండెపోటుతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.
విషయం తెలుసుకున్నబీఆర్‌ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు కానుగుల జోగయ్య, శేఖర్ భారతమ్మను పరామర్శించారు. అనంతరం వైద్య సిబ్బందితో మాట్లాడి భారతమ్మకు మెరుగైన వైద్యాన్ని అందించాలని కోరారు. భారతమ్మ అత్యవసర చికిత్స నిమిత్తం కానుగుల జోగయ్య 5వేల రూపాయలు, వార్డు సభ్యులు శేఖర్ 5 వేల రూపాయలు భారతమ్మ కుటుంబ సభ్యులకి అందజేశారు. కార్యక్రమంలో వెల్దండ మాజీ ఎంపీటీసీ జ్యోతి నిరంజన్ నాయకులు కట్ట అనిల్‌కుమార్, వెంకటేశ్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
