తాడ్వాయిలో కాంగ్రెస్ కార్యకర్తల సంబరాలు..

తాడ్వాయి, ఆంధ్రప్రభ: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో గెలుపునందుకున్న నేపథ్యంలో తాడ్వాయి మండలంలో కాంగ్రెస్ నాయకులు బాణాసంచా పేల్చి ఘనంగా సంబరాలు నిర్వహించారు. మండల కాంగ్రెస్ బీసీ సెల్ అధ్యక్షుడు యశడుపు మల్లయ్య ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి.

ఈ సందర్భంగా మల్లయ్య మాట్లాడుతూ.. నవీన్ యాదవ్ విజయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న ప్రజాసంక్షేమ పథకాలు కీలక పాత్ర వహించాయని అన్నారు. అలాగే మంత్రి సీతక్క చరిష్మా, ములుగు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పైడాకుల అశోక్ గడప గడపకు తిరుగుతూ చేసిన ప్రచారం కూడా గెలుపుకు బలమైన కారణమని పేర్కొన్నారు.

అలాగే కాంగ్రెస్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో స్థానిక నాయకులు, కార్యకర్తల కృషిని కూడా మల్లయ్య ప్రత్యేకంగా ప్రస్తావించారు.

కార్యక్రమంలో తాడ్వాయి మండలం యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు దుబాసి సుధాకర్, ఎస్సిసెల్ మండల ఉపాధ్యక్షులు పురిషోత్తం నారాయణ, సీనియర్ నాయకులు భూషబోయిన పుల్లయ్య, కొరగట్ల వెంకన్న, పీరీల శ్రవణ్, పొమ్మయ్య, కొప్పుల కార్తీక్, అంబటి సమ్మయ్య, పరిషబోయిన నర్సింహులు, మహిళా నాయకురాలు గ్రామ పెద్దలు యూత్ అందరు పాల్గొన్నారు.

Leave a Reply