Congress party | ప్రచారంలో బ్రహ్మరథం పడుతున్న ప్రజలు

Congress party | ప్రచారంలో బ్రహ్మరథం పడుతున్న ప్రజలు

Congress party | పరకాల, ఆంధ్రప్రభ : పరకాల మండలంలోని లక్ష్మీపురం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ(Congress party) బలపరిచిన గ్రామంలో ప్రచారం ముమ్మరం చేశారు. గ్రామంలోని ఓటర్లు, మహిళలు, వృద్ధులు, యువకులు తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సర్పంచ్ అభ్యర్థి పుట్ట సరిత రాజుకు బ్రహ్మరథం పడుతూ దీవిస్తున్నారు.

ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన పుట్ట సరిత రాజు గ్రామంలోని సమస్యల పట్ల అవగాహన కలిగి ఉండడం. గ్రామ సర్పంచ్(village sarpanch) గా గెలిపించుకుంటే గ్రామంలో అభివృద్ధి అంచలంచలుగా జరుగుతుందని ఇక్కడి ప్రజలు గ్రహిస్తున్నారు.

ప్రచారంలో భాగంగా తనకు ఒకసారి అవకాశం కల్పించి సర్పంచిగా ఎన్నుకుంటే గ్రామంలోని మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారిస్తానని, గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానని అభ్యర్థి పుట్ట సరిత రాజు(candidate Putta Saritha Raju) ఓటర్లకు తెలియజేస్తూ అభ్యర్థిస్తున్నారు. ప్రచారంలో వారి వెంట గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply