ఆలేరులో కాంగ్రెస్‌ నేతల నిరసన

ఆలేరు, ఆంధ్రప్రభ: ఓటర్ల జాబితా సవరణ, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత తదితర అంశాలపై కాంగ్రెస్‌, ఇండియా కూటమి నేతలు లేవనెత్తుతున్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ దేశవ్యాప్తంగా చేపడుతున్న నిరసనల్లో భాగంగా గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్‌ నాయకులు ‘బ్లాక్‌ డే’ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆలేరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బీజన బాలమణి భాస్కర్‌, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్‌రెడ్డి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ అంగడి ఆంజనేయులు మాట్లాడుతూ.. ఓట్లను తొలగించడం ద్వారా కుటిల మార్గంలో తిరిగి అధికారంలోకి రావాలని బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఓటర్ల జాబితా, ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు స్పష్టత కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో మండల, పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షులు గంధమల్ల అశోక్‌, కే. సాగర్‌రెడ్డి, కౌన్సిలర్లు మల్లెల సరిత శ్రీకాంత్‌, జెట్ట నీరజ సిద్ధులు, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ మోర్తల మోహన్‌రెడ్డి, నాయకులు సందుల సురేష్‌, ఎండీ సలీం, కూళ్ల నరసింహులు, తాళ్లపల్లి మహేష్‌, దూడల రాజశేఖర్‌, ఎండీ గౌస్‌, చింతకింది సిద్ధులు, సుక్క రామస్వామి తదితరులు పాల్గొన్నారు.