భక్తిశ్రద్ధలతో దేవి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించాలి

  • పందిరిపూజలో పాల్గొన్న కాంగ్రెస్‌ నాయకుడు తూము చౌదరి

లక్ష్మీదేవిపల్లి, ఆంధ్రప్రభ : లక్ష్మీదేవిపల్లి మండలం హేమచంద్రపురం గ్రామంలో దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన పందిరిపూజ (కర్రపూజ) కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు తూము చౌదరి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా తూము చౌదరి మాట్లాడుతూ.. దేవి నవరాత్రి ఉత్సవాలను గ్రామస్తులు, కమిటీ సభ్యులు ఐక్యంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ఉత్సవాలను ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించేందుకు కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేయాలని కోరారు.

ఉచిత రక్త పరీక్షల కేంద్రం ప్రారంభం

అనంతరం లక్ష్మీదేవిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ‘ఎస్‌ఆర్‌ డయాగ్నోస్టిక్స్‌’ లో ఉచిత రక్త పరీక్షల కేంద్రాన్ని తూము చౌదరి ప్రారంభించారు. నిరుపేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు ముందుకొచ్చిన ఎస్‌ఆర్‌ డయాగ్నోస్టిక్స్‌ నిర్వాహకుడు నరేందర్‌, ఆయన బృంద సభ్యులను అభినందించారు.

ప్రజలకు ఉపయోగపడేలా సేవలను కొనసాగించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పూనెం శ్రీనివాస్‌, జిల్లా మైనార్టీ నాయకుడు ఎం.డి. గౌస్‌ పాషా, తాటి తిరుమలేష్‌, బండా వెంకటేశ్వర్లు, దాసలపూడి శివ తదితరులు పాల్గొన్నారు.