ఘనంగా కాంగ్రెస్ నేత అశ్రీఫ్ జన్మదిన వేడుకలు

ఘనంగా కాంగ్రెస్ నేత అశ్రీఫ్ జన్మదిన వేడుకలు

మంత్రి తుమ్మల అడుగుజాడల్లో ప్రజాసేవే లక్ష్యం
నిజాయితీ, నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనం
అభివృద్ధికి చిరునామాగా ఖమ్మం జిల్లా
జిల్లా కు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ఘనత తుమ్మలదే
తుమ్మల యుగంధర్ అడుగుజాడల్లోనే మా పయనం


ఖమ్మం, నవంబర్ 4(ఆంధ్రప్రభ ) : మాజీ నగర గ్రంథాలయ సంస్థ చైర్మన్, జిల్లా కాంగ్రెస్ నాయకులు మొహమ్మద్ అశ్రీఫ్ జన్మదిన వేడుకలు బుధవారం ఖమ్మం నగరంలో ఘనంగా నిర్వహించారు. నగరంలోని పలు డివిజన్లలో స్నేహితులు, అనుచరులు , అభిమానులు, శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. పలుచోట్ల కేక్‌లు కట్ చేసి అశ్రీఫ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.వ్యక్తిగత జన్మదినవేడుకలను సమాజ సేవతో ముడిపెట్టి నిర్వహించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.యువత పెద్ద సంఖ్యలో పాల్గొని జన్మదిన వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా మొహమ్మద్ అశ్రీఫ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాజకీయాల్లో నిజాయితీ, నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనమని కొనియాడారు. ప్రజాసేవ పట్ల ఆయనకున్న అంకితభావం, అభివృద్ధి పట్ల ఉన్న దూరదృష్టి ఖమ్మం జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాయని పేర్కొన్నారు. అభివృద్ధికి చిరునామాగా ఖమ్మం జిల్లాను తీర్చిదిద్దడంలో మంత్రి తుమ్మల కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు.

మంత్రి తుమ్మల రాజకీయ ప్రస్థానం పదవుల కోసం కాకుండా ప్రజల సంక్షేమం, ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా సాగిందని అశ్రీఫ్ పేర్కొన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి మౌలిక సదుపాయాల కల్పనకు, అభివృద్ధి కార్యక్రమాల అమలుకు ఆయన నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత, ప్రజల పట్ల బాధ్యత ఎంత ముఖ్యమో తుమ్మల తన ఆచరణ ద్వారా నిరూపించారని అన్నారు.మంత్రి తుమ్మల చూపిస్తున్న మార్గం యువతకు ఆదర్శప్రాయమని, ఆయన నాయకత్వ లక్షణాలను నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. రాజకీయాల్లోకి వచ్చే యువత పదవులు, వ్యక్తిగత ప్రయోజనాల కంటే ప్రజాసేవకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. మంత్రి తుమ్మల నాయకత్వంలో ఖమ్మం జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు పార్టీ ఆశయాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

డాక్టర్ తుమ్మల యుగంధర్ అడుగుజాడల్లోనే మా పయనం
మంత్రి తుమ్మల తండ్రికి తగ్గ తనయుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు డాక్టర్ తుమ్మల యుగంధర్ ఆధ్వర్యంలోనే తాను రాజకీయంగా ముందుకు సాగుతున్నానని, ఆయన నాయకత్వంలో పార్టీ కోసం, ప్రజాసేవ కోసం నిరంతరం పనిచేస్తున్నానని మొహమ్మద్ అశ్రీఫ్ పేర్కొన్నారు. డాక్టర్ యుగంధర్ తనకు రాజకీయంగా మార్గదర్శకుడని పేర్కొన్నారు. నాయకులు కార్యకర్తల పై ఆయన చూపిస్తున్న ప్రేమాభిమానాలు, ఆప్యాయత ఎంతో ప్రోత్సాహాన్నిస్తున్నాయని అన్నారు. యువతను ప్రోత్సహిస్తూ, పార్టీ నాయకులు, కార్యకర్తలను కలుపుకొని ముందుకు సాగుతున్న యుగంధర్ నాయకత్వం తనకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఆయన మార్గదర్శకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అంకితభావంతో కృషి చేస్తానని, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు మరింత చేరువై సేవలందిస్తానని స్పష్టం చేశారు. రానున్న ఖమ్మం నగరపాలక సంస్థ ఎన్నికల్లో డాక్టర్ తుమ్మల యుగంధర్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ విజయానికి శక్తివంచన లేకుండా పనిచేస్తానని అశ్రీఫ్ వెల్లడించారు.తన జన్మదినాన్ని పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలిపిన స్నేహితులు,అభిమానులు, శ్రేయోభిలాషులందరికీ మొహమ్మద్ అశ్రీఫ్ కృతజ్ఞతలు తెలిపారు. తనపై చూపిస్తున్న అభిమానాన్ని ప్రజాసేవ ద్వారా నిలబెట్టుకుంటానని పేర్కొన్నారు.