దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కాంగ్రెస్ కుట్ర

చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కే.ఎస్ రత్నం
చేవెళ్ల, ఆంధ్రప్రభ
: దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో పార్టీ ఆ కుట్ర పన్నుతుందని చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కే‌.ఎస్ రత్నం ఆరోపించారు. సోమవారం చేవెళ్ల పట్టణ కేంద్రంలోని హైదరాబాద్ – బీజాపూర్ జాతీయ రహదారిపై డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ ఎంపీ బిమోల్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. భాజపా మహిళా మోర్చా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, బిమోల్ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో అరాచకాలు, అల్లర్లు సృష్టించి దేశాన్ని ప్రపంచంలో నవ్వులపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించిన కాంగ్రెస్ మణిపూర్ ఎంపీ అంగొంచ్ భీమొల్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ శ్రీశైలం యాదవ్, మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి స్వర్ణలతారెడ్డి, జిల్లా అధ్యక్షురాలు మమతా రెడ్డి, భాజపా మున్సిపల్ అధ్యక్షులు అత్తేలి అనంత్ రెడ్డి, బీజేవైఎం జిల్లా కార్యదర్శి డాక్టర్ వైభవ్ రెడ్డి, మహిళా కౌన్సిలర్లు మనీషా అనంత్ రెడ్డి, మీనాక్షి సత్యనారాయణ, నాయకులు భోజిరెడ్డి, వెంకట్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, కుంచం శ్రీనివాస్ తదితరులున్నారు.