Congress – Brs | స‌యోధ్య‌..!

Congress – Brs |స‌యోధ్య‌..!

Congress – Brs | ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి మున్సిపాలిటీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పార్టీలైన కాంగ్రెస్-బీఆర్ఎస్ (Congress – Brs) ల మధ్య సయోధ్య కుదిరింది. మున్సిపాలిటీ ఛైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ పదవులను కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పంచుకున్నాయి.

ఛైర్ పర్సన్ గా కాంగ్రెస్ (Congress) పార్టీ కూటమిలోని ఉమారాణి ఎన్నుకోనున్నారు. ఉమారాణి 38వ వార్డునుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి కాంగ్రెస్ లో చేరారు. వైస్ ఛైర్ పర్సన్ గా బీఆర్ఎస్ (Brs) పార్టీకి చెందిన 12వ వార్డు అభ్యర్థి కాసర్ల గోదావరిని ఎన్నుకోనున్నారు. అధికారికంగా ఎన్నిక జరిగే వరకు నేతలు గోప్యంగా ఉంచుతున్నారు.

Leave a Reply