Congress | గ్రామ అభివృధ్ధే నా లక్ష్యం..

Congress | భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : భీమ్‌గల్ మండలంలోని పురాణిపేట్ గ్రామం కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గా బలపరిచిన అభ్యర్థి తోట లావణ్య హరీష్, అభివృద్ధి చేసే అవకాశం ఇవ్వాలని కోరారు. ప్రజాసేవ చేయాలన్న ఉద్దేశంతో సర్పంచ్ గా పోటీ చేయడం జరుగుతుందన్నారు. గ్రామాన్ని సమస్యలు లేని గ్రామంగా తీర్చిదిద్దేందుకు తమను సర్పంచ్ గా గెలిపించాలని ఆమె కోరారు. ప్రభుత్వం ద్వారా పురాణిపేట్ గ్రామంలో తాగునీటి సమస్యతో పాటు, విద్యుత్ సమస్యలకు, అలాగే మురికి కాలువల నిర్మాణం సిమెంట్ రోడ్డు నిర్మాణానికి అధిక ప్రాధాన్యత కల్పించడం జరుగుతుందని చెప్పారు. యువత కోసం యూత్ రూమ్, మహిళా భవనంతో పాటు గ్రామంలో మినీ గ్రంథాలయం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. 24 గంటలు ప్రజాసేవకు అందుబాటులో ఉంటానని తెలిపారు.

Leave a Reply