CONGRESS | ఎల్‌పీజీ అంశంపై రాహల్‌ గాంధీ

CONGRESS | ఎల్‌పీజీ అంశంపై రాహల్‌ గాంధీ

CONGRESS | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మనం ఎవరి నుంచి చమురు కొనాలో అమెరికా ఎలా నిర్ణయిస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. పార్లమెంట్ ప్రాంగణంలో ప్రతిపక్ష నేతలు దీనిపై నిరసన చేపట్టారు. గ్యాస్ కొరత సమస్యను త్వరగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా ఈ నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రంపై విమర్శలు గుప్పించారు… హర్మూజ్‌ జల సంధి నుంచి పెద్దఎత్తున దిగుమతులు జరగాల్సి ఉందన్నారు. యుద్ధ సమయంలో హర్మూజ్‌ జలసంధి నుంచి దిగుమతులు ఆగిపోయాయన్నారు.

ఇది ఆరంభం మాత్రమేనన్నారు. గ్యాస్‌ కొరతతో దేశం అల్లాడుతోందన్నారు. తన ప్రసంగంలో ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌ గురించి రాహుల్‌గాంధీ ప్రస్తావించారు. మనం ఎవరి నుంచి చమురు కొనాలో అమెరికా ఎలా నిర్ణయిస్తుందని అన్నారు. రష్యా నుంచి చమురు కొనాలో.. వద్దో.. మనకు మనం నిర్ణయించుకోవాలన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలుపై అమెరికా జోక్యం ఎందుకు? రాహుల్ గాంధీ ప్రశ్నించారు.

Leave a Reply