congress | కూటమితో ప్రజలకు ఒరిగిందేమీ లేదు..

congress | కూటమితో ప్రజలకు ఒరిగిందేమీ లేదు..
congress | శ్రీకాకుళం బ్యూరో, ఆంధ్రప్రభ: కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో కులం, మతం పేరుతో పాలన సాగిస్తూ ప్రజల సంక్షేమానికి గాలికి వదిలేసిందని కేంద్రమాజీ మంత్రి జె.డి.శీలం విమర్శించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన అస్తవ్యస్థంగా మారిపోయిందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మతాన్ని పెంచి పోషించే విద్వేషాలకు ఆజ్యం పోస్తూ రాజకీయాలు నడుపుతు న్నారన్నారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని రాష్ట్రంలో కూటమి ఆదర్శంగా తీసుకొని పాలన సాగిస్తున్న వైనాన్ని ప్రజలు అసహ్యహించుకుంటున్నారన్నారు. మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకాన్ని పరిరక్షించేందుకు పీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలారెడ్డి ప్రతి జిల్లాలో పర్యటిస్తూ గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని శీలం తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ అటు జాతీయ స్థాయిలోను, ఇటు రాష్ట్ర స్థాయిలోనూ బలోపేతం అవుతూ ప్రజలకు మరింత చేరువ అవ్వడానికి రాహుల్‌గాంధీ నేతత్వంలో పనిచేస్తున్నదన్నారు. కూటమి పాలనలో ప్రతి జిల్లాలోను ప్రజా ప్రతినిధులు ఇసుక, మద్యం, గనులు దోచుకుంటూ పాలన గాలికి వదిలేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశసమైక్యతకు కషి చేస్తోందని, రానున్నరోజుల్లో అధికారం పొందే దిశగా అడుగులు వేస్తుందని శీలం స్పష్టం చేశారు.
విలేకరుల సమావేశంలో కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, పిసిసి ఉపాధ్యక్షుడు వేగి వెంకటేష్, రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ సెల్ అధ్యక్షుడు కామన ప్రభాకరరావు, డిసిసి అధ్యక్షులు సనపల అన్నాజీరావు, కాంగ్రెస్ నాయకులు పేడాడ పరమేశ్వరరావు, అంబటి కష్ణారావు, రెల్ల సురేష్, కోత మధు సూదనరావు, తెంబూరు మధుసూనదరావు, మామిడి సత్యనారాయణ, ఆబోతుల వెంకటనాయుడు, కె.వి.ఎల్.ఎస్.ఈశ్వరి, కవిటి గోపాలకష్ణ, ఎం.చక్రవర్తిరెడ్డి, చింతాడ దిలీప్, అంబటి దాలినాయుడు, మంత్రి నరసింహమూర్తి, బస్వా షన్ముఖరావు, లఖినేన నారాయణరావు, బొచ్చ వెంకటరమణ, చింతాడ దిలీప్, కొరాయి ప్రసాద్, ఇజ్జురోతు రమణ, కొత్తకోట్ల సింహాద్రినాయుడు, లక్ష్మి కరిమజ్జి మల్లేశ్వరరావు, లఖినేని సాయిరాం పూడి కిరణ్ కుమార్, ,చాన్ బాషా తంగుడి వీర్రాజు పాల్గొన్నారు.
